తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రిపబ్లిక్​ డే'లో ఆకట్టుకున్న మోదీ తలపాగా - మోదీ వస్త్రధారణ

ఎల్లప్పడూ ప్రత్యేక వస్త్రధారణతో కనిపించే ప్రధాని మోదీ.. గణతంత్ర దినోత్సవంలోనూ తన మార్క్​ చూపించారు. జామ్​ నగర్​ రాజకుటుంబం నుంచి కానుకగా పొందిన తలపాగా ధరించారు.

PM Modi sports special Jamnagar Paghdi on 72nd Republic Day
'రిపబ్లిక్​ డే' లో ఆకట్టుకున్న మోదీ తలపాగా

By

Published : Jan 26, 2021, 12:50 PM IST

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వేషధారణ ఆకట్టుకుంది. రాజ్​పథ్​లో నిర్వహించిన పరేడ్​ను పురస్కరించుకుని ప్రత్యేక జామ్​నగర్​ తలపాగాలో ఆయన కనిపించారు.

గణతంత్ర వేడుకలకు ప్రతి ఏడాదిలాగే ఈ సారీ ప్రత్యేక వస్త్రధారణతో కనిపించారు మోదీ. ఎరుపు వస్త్రంపై పసుపుపచ్చ చుక్కలున్న తలపాగా చుట్టారు. దీనిని గుజరాత్​ జామ్​నగర్​కు చెందిన రాజ కుటుంబం నుంచి ఆయన కానుకగా పొందారు. వీటితో పాటు సంప్రదాయ కుర్తా, పైజామా, బూడిద రంగు జాకెట్​, ముఖానికి మాస్క్​ ధరించారు.

జామ్​నగర్​ తలపాగాతో ప్రధాని మోదీ
జాతీయ పతాకానికి సెల్యూట్​ చేస్తున్న మోదీ
రాష్ట్రపతికి నమస్కరిస్తున్న ప్రధాని
గణతంత్ర వేడుకల్లో పీఎం

ఆహార్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే మోదీ.. వివిధ సందర్భాలకు తగ్గట్లు వస్త్రధారణ మారుస్తూ ఉంటారు. మొట్టమొదటి సారి 2014 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జోధ్​పుర్​కు చెందిన ఎరుపు రంగు వస్త్రానికి చివర ఆకుపచ్చ తోక కలిగిన తలపాగాతో కనిపించారు.

ఇదీ చదవండి:అమర జవాన్లకు మోదీ నివాళులు

ABOUT THE AUTHOR

...view details