తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ముఖ్యమంత్రికి మోదీ ఫోన్​.. ఆదుకుంటామని హామీ - అసోం సీఎంతో మాట్లాడిన మోదీ

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​తో ఫోన్​లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో వరద తీవ్రత, పరిస్థితులపై చర్చించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది.

PM Modi speaks with Assam CM over floods
వరదల్లో చనిపోయినవారికి రూ. 2లక్షల పరిహారం

By

Published : Jul 4, 2020, 4:47 AM IST

భారీ వర్షాల వల్ల వరదలతో అతలాకుతలం అవుతోంది అసోం. రాష్ట్రంలోని పరిస్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​తో ఫోన్​లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విపత్కర సమయంలో రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అసోం వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి రూ. 2లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

వరదల్లో చనిపోయినవారికి రూ. 2లక్షల పరిహారం

రాష్ట్రంలో కరోనా, వరదల బీభత్సం వంటి విషయాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని అసోం సీఎం సోనోవాల్​ తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారాన్ని అందించనున్నట్లు మోదీ చెప్పారని పేర్కొన్నారు.

వరదల వల్ల అసోంలో 33 జిల్లాలకు గానూ 22 జిల్లాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 16.03 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే..

ABOUT THE AUTHOR

...view details