తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు చెన్నైలో మోదీ పర్యటన.. ఐఐటీ మద్రాసులో ప్రసంగం - ఐఐటీ మద్రాసులో మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో తను చేయబోయే ప్రసంగానికి విలువైన సూచనలు ఇవ్వాలని విద్యార్థులను, దేశ పౌరులను కోరారు. నమో యాప్​ ద్వారా తమ సలహాల్ని పంపవచ్చని సూచించారు.

నేడు చెన్నైలో మోదీ పర్యటన.. ఐఐటీ మద్రాసులో ప్రసంగం

By

Published : Sep 30, 2019, 8:15 AM IST

Updated : Oct 2, 2019, 1:25 PM IST

నేడు చెన్నైలో మోదీ పర్యటన.. ఐఐటీ మద్రాసులో ప్రసంగం

తమిళనాడులోని ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో తను చేయబోయే ప్రసంగానికి విలువైన సలహాలు, సూచనలు అందించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.

ముఖ్యంగా ఐఐటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమ ఆలోచనల్ని తప్పకుండా పంచుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు. నమో యాప్​లోని ఓపెన్ ఫోరం ద్వారా తమ సలహాల్ని పంపించవచ్చని తెలిపారు.

ఐఐటీ మద్రాసులో ప్రసంగానికి ప్రజల సలహాలు కోరిన ప్రధాని మోదీ

హ్యాకథాన్​ విజేతలకు..

చెన్నైలో జరిగే మరో కార్యక్రమంలో సింగపూర్​-ఇండియా హ్యాకథాన్​ పోటీల్లో విజేతలకు మోదీ.. పురస్కారాలు అందజేయనున్నారు. హ్యాకథాన్​ని యువశక్తి, సృజనాత్మకతల కలయికగా అభివర్ణించారు ప్రధాని. దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం కనుగొనే యువతరాన్ని ఇలాంటి పోటీలు.. ఒక వేదిక మీదకు తీసుకొస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:గాంధీ-150: బాపూ, బాబా సాహెబ్ ఆలోచనలకు అదే తేడా

Last Updated : Oct 2, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details