కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ ఆలోచనలు, సమస్యలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 28 న ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో చర్చించేందుకు ప్రజల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
'మన్‌కీ బాత్'లో ఆలోచనలు పంచుకోండి: మోదీ - మన్ కీ బాత్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో.. ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవాలను పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ అభిప్రాయాలను 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసారం చేస్తామని వివరించారు.
'మన్‌కీ బాత్' కోసం ఆలోచనలు పంచుకోండి!
ఓపెన్ ఫోరం అయిన..'ల్వీబ్నిర్' షేర్ చేసి లేదా టోల్‌ఫ్రీ నెంబర్ 1800-11-7800 కు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చన్నారు మోదీ. హిందీ, ఇంగ్లీషు భాషల్లో సందేశాలను పంపించాలని చెప్పారు. అవన్నీ రికార్డవుతాయని, వాటిలో కొన్నింటిని ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు.