దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. 34వ ప్రగతి సమావేశంలో భాగంగా ఆయన వీటిపై చర్చించారు.
రైల్వే, రోడ్డు రవాణా, రహదారులు, గృహ, పట్టణ వ్యవహరాల శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా మోదీ సమీక్షించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, బంగాల్, మహారాష్ట్ర, దిల్లీ, హరియాణా, గుజరాత్, దాద్రా నగర్ హవేలీలో ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొంది.