రష్యా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ పని ఎంతగానో ఆకట్టుకుంటోంది. తూర్పు ఆర్థిక సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మోదీ... ఓ ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
సోఫా వద్దు... అందరితోనే నేను: మోదీ - ఇండియా
రష్యా పర్యటనలో మోదీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తూర్పు దేశాల ఆర్థిక సదస్సు అనంతరం.. ప్రధాని ఓ ఫొటో సెషన్లో పాల్గొన్నారు. అధికారులు... ప్రధాని కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సోఫాను ఏర్పాటు చేశారు. అయితే.. అందులో కూర్చునేందుకు తిరస్కరించిన మోదీ తనకూ కుర్చీనే వేయాలని సూచించారు.
సోఫా వద్దు... అందరితోనే నేను: మోదీ
ఈ కార్యక్రమంలో ప్రధాని కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సోఫాను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే... అందులో కూర్చోవడానికి మోదీ తిరస్కరించి అందరికీ వేసిన కుర్చీనే తనకూ వేయాలని సూచించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు ఆ సోఫాను అక్కడి నుంచి తీసేసి.. మిగతా వారికి వేసిన కుర్చీనే ఏర్పాటు చేశారు.
ఈ దృశ్యాల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు... మోదీ నిరాడంబరతను కొనియాడుతున్నారు.
Last Updated : Sep 29, 2019, 3:10 PM IST