పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై తొలిసారి స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీ ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో ఉండాలని కోరారు. దేశ రాజధానిలో నెలకొన్న పరిస్థితులపై విస్తృత సమీక్ష చేపట్టినట్లు ట్వీట్ చేశారు.
" దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై విస్తృత సమీక్ష జరిగింది. పోలీసులు, ఇతర భద్రత సంస్థలు శాంతిని, సాధారణ స్థితిని కల్పించడానికి కృషి చేస్తున్నారు. శాంతి, సామరస్యం అనేవి మన నైతిక విలువలకు ప్రధానమైనవి. శాంతియుతంగా, సోదరభావంతో ఉండాలని దిల్లీ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. అతి త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుంది."