తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గురువాయూర్​ ఆలయంలో మోదీ పూజలు - MODI

నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రం కేరళలో పర్యటించారు. కేరళ త్రిస్సూర్​లోని గురువాయూర్​ శ్రీ కృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచెకట్టు వస్త్రధారణలో ఆకట్టుకున్నారు మోదీ.

గురువాయూర్​ ఆలయంలో మోదీ పూజలు

By

Published : Jun 8, 2019, 11:00 AM IST

Updated : Jun 8, 2019, 2:15 PM IST

గురువాయూర్​ ఆలయంలో మోదీ పూజలు

ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తొలిసారి దక్షిణాది రాష్ట్రానికి వచ్చారు. కేరళకు గత రాత్రి చేరుకున్న ప్రధాని.. నేడు త్రిస్సూర్​లోని గురువాయూర్​ శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శించారు. గంటపాటు అక్కడే కలియతిరిగారు ప్రధాని.

తులాభారం...

కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం​ ఏర్పాటైన తర్వాత వెళుతున్న తొలి విదేశీ పర్యటనకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని. అనంతరం మోదీకి తులాభారం నిర్వహించారు ఆలయ అర్చకులు. భక్తులందరూ ఈ సన్నివేశాన్ని ఆసక్తితో తిలకించారు. భక్తులకు మోదీ అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు.

ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. డాగ్​స్క్వాడ్​తో తనిఖీలు నిర్వహించారు.

Last Updated : Jun 8, 2019, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details