తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి

ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమర జవానులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీడీఎస్​ రావత్​తో పాటు త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

PM Modi pays homage to fallen soldiers at newly-built National War Memorial for first time
జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి

By

Published : Jan 26, 2020, 10:02 AM IST

Updated : Feb 18, 2020, 10:55 AM IST

జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని 'జాతీయ యుద్ధ స్మారకం' వద్ద అమర జవానులకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు విడిచిన వీరులను గుర్తుచేసుకున్నారు.

గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళులర్పించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు వరకు అమర్​ జవాన్​ జ్యోతి వద్దే శ్రద్ధాంజలి ఘటించేవారు.

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్​, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ.. ట్విట్టర్​ ద్వారా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.

"ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్​."


-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్​ షా, రమేశ్​ పోక్రియాల్​, ప్రకాశ్​ జావడేకర్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:- '26'... భారత్​కు ఈ సంఖ్య ఎంతో ప్రత్యేకం తెలుసా?

Last Updated : Feb 18, 2020, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details