బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ గొప్ప ధైర్యమున్న నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నిర్వహించిన రెహ్మాన్ శత జయంత్యుత్సవ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆయనకు ఘన నివాళి తెలిపారు. బంగ్లాదేశ్‌ను మారణహోమం నుంచి బయటకు తీసుకురావడానికి ముజిబుర్ రెహ్మాన్ తీవ్రంగా శ్రమించారని కొనియాడారు.
"బంగాల్ బంధు అంటే నమ్మకం ఉన్న వ్యక్తి. ధైర్యం కల నాయకుడు. శాంతి, న్యాయం, సమానత్వం, గౌరవానికి చిహ్నం. ఇటువంటి లక్షణాలు ఆయన కాలంలో బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు లక్షలాది మంది యువతకు కొత్త శక్తినిచ్చాయి."-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి