తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతితో ప్రధాని భేటీ- కీలక అంశాలపై చర్చ - PM Modi meets President Kovind news upadates

ఈ ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రపతికి రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల గురించి వివరించారు.

PM Modi meets President Kovind to discusses domestic and international affairs
రాష్ట్రపతితో ప్రధాని భేటీ- కీలక అంశాలపై చర్చ

By

Published : Dec 31, 2020, 6:22 AM IST

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో దేశీయ,అంతర్గత వ్యవహారాలు గురించి రాష్ట్రపతికి వివరించారు ప్రధాని.

"2020 సంవత్సరం పూర్తి కానున్న తరుణంలో రాష్ట్రపతిని కలిశారు మోదీ. దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల గురించి వివరించారు. 2021 సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వచ్చే ఏడాది భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు" అని రాష్ట్రపతి సచివాలయం ట్వీట్​ చేసింది.

"కొవిడ్​-19 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. అందుకే భారత్​ను మరింత స్వావలంబన దేశంగా అంటే 'ఆత్మనిర్భర్​ భారత్​' చేస్తామని మేం ప్రతిజ్ఞ చేశాం. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఆ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది." అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రస్తుత వ్యవహారాల గురించి కాకుండా.. రాబోయే సంవత్సరానికి భారత ప్రజల ఆశయాలు, ఆశలపై కుడా చర్చించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులను సమీక్షించిన మోదీ

ABOUT THE AUTHOR

...view details