నోబెల్ విజేత, ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై అభిజిత్‌తో చర్చించారు.
బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. ప్రజాసాధికారత కోసం ఆర్థికవేత్త చేస్తున్న కృషిని కొనియాడారు. వీరి భేటీకి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు ప్రధాని.
"నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీని కలవడం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రజాసాధికారతకు ఆయన చేస్తున్న కృషి స్పష్టంగా కనపడుతోంది. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. ఆయన విజయాలను చూసి దేశం గర్వపడుతోంది. అభిజిత్ భవిష్యత్తు కార్యచరణ కోసం నా శుభాకాంక్షలు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ప్రపంచంలో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు భిన్న ప్రణాళికలతో ప్రభుత్వాలకు సహకరించినందుకు అభిజిత్ బెనర్జీతో పాటు ఆయన భార్య డఫ్లో, మైఖేల్ క్రెమర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురష్కారం వరించింది.