తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికాలో ఇరాన్ అధ్యక్షుడితో మోదీ సమావేశం - modi meets iranian president

ఇరాన్ అధ్యక్షుడు హసన్​ రౌహానీతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికాలో జరుగుతున్న ఐరాస సర్వసభ్య సమావేశాల్లో భాగంగా ఈ భేటీ జరిగింది. ద్వైపాక్షిక సహకారంపై ఇరు దేశాధినేతలు చర్చించారు.

అమెరికాలో ఇరాన్ అధ్యక్షుడితో మోదీ సమావేశం

By

Published : Sep 26, 2019, 11:35 PM IST

Updated : Oct 2, 2019, 4:22 AM IST

అమెరికా న్యూయార్క్​లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు హసన్​ రౌహానీతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక సహకారం, ఇరు దేశాల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

తెహ్రాన్​ అణుకార్యకలాపాలపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రౌహానీతో మోదీ సమావేశం అవడం ఆసక్తికర అంశం. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేయిస్తోందని అగ్రరాజ్యంతో పాటు దాని మిత్ర దేశాలు ఆరోపిస్తున్నాయి.

అమెరికాలో ఇరాన్ అధ్యక్షుడితో మోదీ సమావేశం
Last Updated : Oct 2, 2019, 4:22 AM IST

ABOUT THE AUTHOR

...view details