తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై పాక్​ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే'

బిష్కెక్​ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉగ్రవాద నిర్మూలనలో పాకిస్థాన్​ వైఖరిపై.. మోదీ ఆక్షేపించారు.

చైనా-భారత్

By

Published : Jun 13, 2019, 6:02 PM IST

Updated : Jun 13, 2019, 7:51 PM IST

'ఉగ్రవాదంపై పాక్​ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే'

బిష్కెక్​లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన చైనా, భారత్ దేశాధినేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ నిర్ణయించారు.

ప్రధానిగా మోదీ తిరిగి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిన్​పింగ్​తో​ భేటీ అయ్యారు.

"చైనాతో స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది. ఎస్​సీఓ సదస్సులో భాగంగా ప్రథమంగా జిన్​పింగ్​తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేత మార్గాలపై ఇద్దరు నేతలు చర్చించారు."

-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఇదే వేదికపై పాకిస్థాన్​ విషయంపైనా ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్​ గోఖలే తెలిపారు.

"పాకిస్థాన్​పై ఇద్దరు నేతలు స్థూలంగా చర్చించారు. పాకిస్థాన్​పై స్థిర వైఖరితో ఉన్నట్టు జిన్​పింగ్​కు ప్రధాని స్పష్టం చేశారు. మేం శాంతియుత ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలనుకున్నామని తెలిపారు. ఈ విషయమై ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. ఉగ్రవాద రహిత పరిస్థితులు ఏర్పడేలా పాకిస్థాన్​ కృషి చేయాల్సి ఉందనీ, కానీ అది ఎక్కడా కనిపించటం లేదని ప్రధాని ఆక్షేపించారు. ఈ విషయంలో పాకిస్థాన్​ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉద్ఘాటించారు."

-విజయ్​ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి

చైనా ప్రతిపాదనలు

వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐక్య కూటమిని ఏర్పాటు చేయాలని జిన్​పింగ్​ సూచన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వాణిజ్య విధానాలపై పోరాడాలన్నారు. భారత్​కు అత్యంత ప్రీతిపాత్రమైన దేశం హోదాను అమెరికా రద్దు చేసిన కారణంగా వారికి సహకరిస్తామని చైనా భావిస్తోంది.

ఇదీ చూడండి: బిష్కెక్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Last Updated : Jun 13, 2019, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details