తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాయంత్రం సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్! - కరోనాపై మోదీ యుద్ధం

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా విజృంభణను ఎదుర్కొనే మార్గాలపై ఆయన ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.

PM Modi likely to hold video conference with CMs to discuss coronavirus
ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్​!

By

Published : Mar 20, 2020, 10:36 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనే మార్గాలపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ఇవాళ సాయంత్రం జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కరోనాపై యుద్ధం

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు, స్థానిక అధికారులు కృషి చేయాలని ప్రధాని ఇప్పటికే పిలుపునిచ్చారు. మహమ్మారిపై విజయం సాధించడంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని.. ఈ మేరకు స్వీయ సంకల్పం, స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'

ABOUT THE AUTHOR

...view details