తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదంపై ఏకం కండి: ఐరాస సదస్సులో మోదీ - climate change

ఐరాసలో మోదీ ప్రసంగం: వాతావరణ మార్పులే ప్రధానాంశం..!

By

Published : Sep 27, 2019, 7:34 PM IST

Updated : Oct 2, 2019, 6:20 AM IST

19:59 September 27

భారత్​లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి: మోదీ

భారత దేశం గాంధీ సిద్దాంతాల్ని పాటిస్తుందని.. ఆయన మార్గం ఇప్పటికీ అనుసరణీయమని ఐరాస సదస్సు వేదికగా మోదీ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న భారత్​లో ఐదేళ్లలోనే 11 కోట్ల శౌచాలయాల నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇది ప్రపంచానికి కొత్త సందేశంగా తెలిపారు మోదీ. 

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు... 

  • భారత్‌లో పేదలకు దేశం రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా కల్పిస్తున్నాం
  • డిజిటలీకరణతో అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాం
  • ఇప్పటికే 20 బిలియన్ డాలర్లు మేర ప్రజాధనం ఆదా అయ్యింది
  • అక్టోబర్‌ 2 నుంచి సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నాం
  • 15 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించనున్నాం
  • 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 2 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
  • 2025 నాటికి క్షయ విముక్త భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటాం
  • భారత్‌లో పేదలకు రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా కల్పిస్తున్నాం

19:55 September 27

మేం చేస్తున్న కృషి ప్రపంచానికే బలం: మోదీ

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇచ్చారని మోదీ ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రజలు ఇచ్చిన భారీ ఆధిక్యత వల్లే ఇక్కడికి వచ్చే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. 

  • భారతీయ జీవన విధానంలో సహజీవనానికే ప్రాముఖ్యం
  • మేం చేస్తున్న కృషి భారత్‌కే కాదు.. ప్రపంచానికీ బలాన్ని ఇస్తుంది
  • కాలుష్య కారకాల్లో భారత్‌ చివరి వరుసలో ఉంది
  • కాలుష్య నివారణ చర్యల్లో మాత్రం భారత్‌ ముందువరసలో ఉంది

19:52 September 27

ఉగ్రవాదంపై ఏకం కండి: ప్రపంచ దేశాలకు మోదీ

ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా ఏకం కావల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో కీలక ప్రసంగం చేసిన మోదీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భూతం తీవ్రవాదం అని తెలిపారు.

19:22 September 27

ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇప్పటి వరకు వివిధ అంశాలపై భారత్‌ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ అత్యంత కీలక ప్రసంగం చేయనున్నారు. మరికాసేపట్లో భారత ప్రధాని మాట్లాడనున్నారు.

ఇప్పటివరకూ ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రధాని భారత వాణిని వినిపించారు. నేటి ప్రసంగంలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తారో లేదో చూడాలి. మోదీ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తారా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మోదీ ప్రసంగం అనంతరం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించనున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రసంగంలో ఆర్టికల్‌ 370 రద్దు, మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని ఖండించడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రతినిధులు తెలిపారు.

Last Updated : Oct 2, 2019, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details