బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే ఉత్తర్ప్రదేశ్లో అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న బుందేల్ఖండ్ ప్రాంతాన్ని దిల్లీతో కలపనుంది ఈ హైవే. యూపీలోని చిత్రకూట్, బండా, హమీర్పుర్, జలూన్ జిల్లాల మీదుగా వెళ్లనుంది.
బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు ప్రధాని మోదీ. రూ. 15వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా అనేక ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. పెద్ద నగరాల్లోని సౌకర్యాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.