అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు.
29 ఏళ్లకు మళ్లీ అయోధ్యకు...
హెలికాప్టర్‌లో అయోధ్యకు మోదీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లఖ్‌నవూ చేరుకున్నారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అయోధ్యకు విచ్చేశారు. హెలీప్యాడ్ వద్ద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ఉన్నతాధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. 1991 తర్వాత దాదాపు 29 ఏళ్లకు మోదీ మళ్లీ అయోధ్యలో కాలుమోపారు.
హనుమాన్ ఆలయంలో పూజలు...
అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో మోదీ భూమిపూజ కార్యక్రమంలో మోదీ హెలిప్యాడ్ నుంచి నేరుగా అయోధ్యలోని 10వ శతాబ్దం నాటి హనుమాన్‌గఢీ ఆలయానికి చేరుకున్నారు ప్రధాని. అనంతరం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి అంజన్నను దర్శించుకున్నారు.
హనుమాన్‌గఢీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గడ్డిన్షీన్ ప్రేమదాస్ మహారాజ్ మోదీకి తలపాగా, వెండి ముకుటం,శాలువా ఇచ్చి, ఆశీర్వదించారు.
రాముడి విగ్రహాంతో మోదీ, యోగి ఆదిత్యనాథ్ రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం...
అయోధ్యలోని రామజన్మభూమి వద్ద రామ్‌లల్లాకు ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. రాముడికి పూలమాల వేశారు. అనంతరం రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి నైవేధ్యం పెట్టి హారతి ఇచ్చారు.
మొక్కను నాటి...
పారిజాత మొక్కను నాటిన మోదీ రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజ అనంతరం పారిజాత మొక్కను నాటారు. ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో వెంటే ఉన్నారు.
వైభవంగా భూమిపూజ...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్, ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భూమి పూజలో నక్షత్రాకారంలో ఉన్న 5 వెండి ఇటుకలను ఉపయోగించారు. ఆ వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమ పండితుల చెప్పారు. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను భూమిపూజలో వినియోగించారు. అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శిలాఫలకం ఆవిష్కరణ...
పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని రామమందిర నిర్మాణ శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మహత్తర కార్యానికి గుర్తుగా పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.
మహద్భాగ్యంగా మోదీ అభివర్ణన...
భూమిపూజ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. జై శ్రీరామ్ నినాదాలతో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేటి జయజయధ్వనాలు ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తులకు వినిపిస్తాయని చెప్పారు. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం తన మహద్భాగ్యం అన్నారు మోదీ. ఈ అవకాశాన్ని రామ మందిర ట్రస్టు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.