తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-రష్యా సంయుక్త ఆయుధ తయారీపై మోదీ ఆసక్తి - రష్యా

రష్యా అధ్యక్షుడు పుతిన్​తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు ప్రధాని మోదీ. భారత్​- రష్యా సంయుక్త ఆయుధ తయారీపై మోదీ ఆసక్తి కనబరిచారు. ఇరు దేశాల సాంకేతికతతో భారత్​లో చవక ధరలకే సైనిక పరికరాలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చన్నారు ప్రధాని.

భారత్​-రష్యా సంయుక్త ఆయుధ తయారీపై మోదీ ఆసక్తి

By

Published : Sep 4, 2019, 6:01 AM IST

Updated : Sep 29, 2019, 9:18 AM IST

భారత్​-రష్యా సంయుక్త ఆయుధ తయారీపై మోదీ ఆసక్తి

భారత్​- రష్యా సంయుక్త ఆయుధ తయారీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తి చూపారు. ఇరు దేశాలు తమ సాంకేతికతను వినియోగించి భారత్​లో చవక ధరలకే సైనిక పరికరాలను తయారు చేయవచ్చన్నారు. ఈ పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చన్నారు.

రష్యా పర్యటనలో ఉన్న మోదీ... వ్లాదివోస్తోక్​లో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​తో నేడు చర్చలు జరపనున్నారు. పుతిన్​తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

"పుతిన్​తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేం మంచి స్నేహితులం. మంచి మిత్రులు ఎప్పుడూ భవిష్యత్తు ప్రణాళికలను ఆలోచిస్తారు. మా సంబంధం కేవలం కొనుగోలుదారు- విక్రయదారు మాత్రమే కాదు. రక్షణ, సాంకేతిక సహకారాలకు మించి మా బంధం ముందుకు సాగుతోంది."

--- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.

20వ రష్యా- భారత్​ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ- సాంకేతిక విభాగం సహా మరిన్ని అంశాలపై దాదాపు 15 ఒప్పందాలు జరగనున్నాయి.

భారత్​ తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​ 'గగన్​యాన్​'పైనా మోదీ స్పందించారు. ఈ మిషన్​లో భాగంగా భారత వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి రష్యా సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రష్యా పర్యటనలో భాగంగా 2019 తూర్పు ఆర్థిక సదస్సు(ఈఈఎఫ్​)లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు మోదీ. భారత్​-రష్యా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ తూర్పు ఆర్థిక సదస్సు ఉపయోగపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- రాజధానిలో పెరిగిన 'మందు' భామలు..!

Last Updated : Sep 29, 2019, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details