తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహాభారత యుద్ధం 18 రోజులు- కరోనాపై పోరు 21 రోజులు' - కరోనా వైరస్​ వార్తలు

మహాభారత యుద్ధం 18 రోజులు సాగిందని.. కరోనా మహమ్మారిపై పోరు 21రోజుల పడుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు ప్రధాని. కరోనాపై పోరులో యావత్​ భారతదేశానికి వారణాసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

pm-modi-interacts-with-varanasi-people
మహాభారత యుద్ధం 18.. కరోనాపై పోరు 21 రోజులు

By

Published : Mar 25, 2020, 5:31 PM IST

కరోనాపై పోరులో వారణాసి.. యావత్​ దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని కోరారు.

తన సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు మోదీ. గడ్డు కాలంలో సొంత నియోజకవర్గంలో ఉండాలని.. కానీ దిల్లీలో పరిస్థితుల దృష్ట్యా కుదరలేదని వివరించారు. ఎంత తీరిక లేకుండా ఉన్నా.. వారణాసిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు.

మహాభారత యుద్ధం 18 రోజుల పాటు సాగిందని.. కరోనా మహమ్మారిపై పోరు 21 రోజులు పడుతుందని మోదీ పేర్కొన్నారు. వాట్సాప్​లో హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేసినట్టు మోదీ వారణాసి ప్రజలకు తెలిపారు. ఎలాంటి సందేహాలున్నా.. 9013151515 నంబర్​కు వాట్సాప్​ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details