ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై వదంతులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజకీయాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. దేశంలో జరుగుతోన్న కొన్ని నిరసనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో భాగంగా వర్చువల్గా ఆరు రాష్ట్రాల రైతులతో మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై తోటి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. వాటి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని ప్రతి రైతు తెలుసుకొని లబ్ధిపొందేలా కృషి చేయాలని సూచించారు.
" ఒప్పంద వ్యవసాయంపై అనేక అపోహలు ప్రచారం చేస్తున్నారు. నూతన సాగు చట్టాల విషయంలో వదంతులు సృష్టిస్తున్నారు. కొత్త చట్టాలపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. "