దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపుపై తీవ్ర తర్జనభర్జన పడుతోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈనెల 11న మరోమారు వారితో సమావేశం కానున్నారు. కేసుల సంఖ్యలో పెరుగుదల, లాక్డౌన్ కొనసాగింపుపై చర్చించనున్నారు.
సీఎంలతో శనివారం మోదీ భేటీ- లాక్డౌన్పై నిర్ణయం!
దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈనెల 11న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లాక్డౌన్ పొడగించాలా? వద్దా అనే అంశంపై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు సమాచారం.
ఈనెల 11 సీఎంలో మోదీ భేటీ.
21 రోజుల పాటు విధించిన లాక్డౌన్ ఈనెల 14న ముగియనుంది. అయితే లాక్డౌన్ను పొడిగించాలా? వద్దా అనే విషయంపై ముఖ్యమంత్రులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు లాక్డౌన్ పొడిగిస్తేనే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 11న జరిగే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:'ప్రతి ప్రాణం విలువైందే.. యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి'