తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన - Vaishnavo janatho

వినోదరంగానికి చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ.. శనివారం భేటీ అయ్యారు. మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకుని ఈటీవీ గ్రూప్‌ రూపొందించిన 'వైష్ణవ జన తో' భజన గీతంతో పాటు.. రాజ్‌కుమార్‌ హిరానీ, తారక్‌ మెహతా గ్రూప్, కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించిన వీడియోలను ప్రధాని ఆవిష్కరించారు. దిల్లీలోని ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ప్రధాని ఈ వీడియోలను విడుదల చేశారు.

బాలీవుడ్​ తారలతో ప్రధాని మోదీ.. 'వినోదరంగ శక్తి అపారం'

By

Published : Oct 20, 2019, 5:04 AM IST

Updated : Oct 20, 2019, 9:52 AM IST

వినోదరంగ శక్తి అపారం : ప్రధాని నరేంద్ర మోదీ

మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకుని ఈటీవీ గ్రూప్‌ నిర్మించిన 'వైష్ణవ జన తో' భజన గీతంతో పాటు.. రాజ్‌కుమార్‌ హిరానీ, తారక్‌ మెహతా గ్రూప్‌, కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించిన వీడియోలను ప్రధాని ఆవిష్కరించారు. సామాన్యుడిలో స్ఫూర్తి నింపడంలో వినోదరంగ శక్తి అపారమని మోదీ కొనియాడారు. మహాత్ముడి సిద్ధాంతాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్లడంలో ఈ రంగం గొప్ప పాత్ర పోషించిందని ప్రధాని ప్రశంసించారు. దేశంలోని ప్రముఖ గాయకులందరితో.. ఈటీవీ గ్రూప్​ రూపొందించిన 'వైష్ణవ జన తో' భజన గీతానికి ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలిపారు.

దేశ స్వాతంత్య్ర సంగ్రామం, అభివృద్ధి ప్రస్థానానికి సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ వినోదరంగ ప్రముఖులకు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకుని ఈటీవీ గ్రూప్‌ నిర్మించిన 'వైష్ణవ జన తో' భజన గీతంతో పాటు.. మరిన్ని వీడియోలను ప్రధాని ఆవిష్కరించారు. దిల్లీలోని ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ప్రధాని ఈ వీడియోలను విడుదల చేశారు.

బాలీవుడ్‌ నటులు ఆమీర్‌ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, జాకీష్రాఫ్‌, ఈనాడు గ్రూప్​ ఎండీ సీహెచ్‌ కిరణ్‌, ఈటీవీ సీఈఓ బాపినీడు చౌదరి, ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, సోనూనిగమ్‌, సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు, బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ, నటీమణులు కంగనా రనౌత్‌, సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ రాయ్‌, నిర్మాత ఏక్తాకపూర్‌, తారక్‌ మెహతా గ్రూపు సభ్యులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత విజ్ఞప్తి మేరకు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించడానికి తమ వంతు సమయం కేటాయించిన ప్రముఖులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

వినోదరంగానికి అపార శక్తి

సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో వినోదరంగానికి అపార శక్తి ఉందని, వినోదాత్మకంగా, సృజనాత్మకంగా సామాన్య ప్రజల్లో గాంధీ స్ఫూర్తి నింపేందుకు వినోద రంగం ఇకపై కూడా తమవంతు పాత్ర పోషించాలని ప్రధాని కోరారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో వినోదరంగానికి ఉన్న శక్తి అపారమని.. గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ రంగానికి చెందిన వారంతా అధునాతన సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. ఇటీవల తమిళనాడు మహాబలిపురంలో చైనా అధ్యక్షుడితో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పంచుకున్నారు ప్రధాని. భారతీయ సినిమా దంగల్‌కు చైనాలోనూ ప్రజాదరణ దక్కిన విషయాన్ని జిన్​పింగ్​ తన దృష్టికి తీసుకొచ్చారని, ఆగ్నేయాసియాలో రామాయణానికి ఉన్న ప్రత్యేకతని ఆయన ప్రస్తావించినట్లు ప్రధాని వివరించారు.

ఏటా.. అంతర్జాతీయ వినోద సదస్సు

2022 నాటికి దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్న నేపథ్యంలో 1857 నుంచి 1947 వరకు జరిగిన భారత స్వాతంత్ర్య సంగ్రామం, 1947 నుంచి 2022 వరకు సాగిన భారతీయ అభివృద్ధి ప్రస్థానానికి సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రధాని ప్రత్యేకంగా కోరారు. ఇక నుంచి ఏటా.. అంతర్జాతీయ వినోద సదస్సు నిర్వహించాలనుకుంటున్నట్లు బాలీవుడ్‌ ప్రముఖులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ ప్రధాని ప్రత్యేక అభినందనలు అందజేశారు.

రామోజీరావుకు ప్రశంసలు

ఈ సందర్భంగా రామోజీ గ్రూప్​ ప్రతినిధులతో సంభాషించిన ప్రధాని మోదీ.. ఈనాడు-ఈటీవీ సంస్థలు స్వచ్ఛభారత్​ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి.. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాయని ప్రశంసించారు. సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాల్లో రామోజీరావు తనకన్నా ఎప్పుడూ రెండడుగులు ముందే ఉంటారంటూ ప్రధాని కొనియాడారు. 'వైష్ణవ జన తో' వీడియోను ఈటీవీ భారత్​ ఎంతో సృజనాత్మకంగా రూపొందించిందని మోదీ అభినందించారు.

ప్రధానిని కొనియాడిన తారలు

మహాత్మాగాంధీ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఎవరి వంతు వారు ప్రయత్నించేలా.. ప్రధాని మోదీ ఆదర్శంగా నిలిచారని, అందరికీ మార్గదర్శకం చేస్తూ మద్దతుగా నిలుస్తున్నారని బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ ఖాన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ కితాబిచ్చారు. గాంధీ సిద్ధాంతాలను చాటిచెప్పేందుకు వేదిక కల్పించి అందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చిన ప్రధాని శ్రమను ఎవరూ మరువలేరని ప్రముఖ నటుడు షారుక్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి : 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Last Updated : Oct 20, 2019, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details