కర్తార్‌పుర్ నడవా విషయంలో భారతీయుల మనోభావాలను గౌరవించినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు.... ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. డేరాబాబానానక్ వద్ద భక్తులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.... కారిడార్ వల్ల దర్బార్ సాహిబ్ గురుద్వారా దర్శనం సులువవుతుందన్నారు.కర్తార్‌పుర్ కారిడార్‌ను దేశానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కర్తార్‌పుర్ నడవా ద్వారా పాక్‌లోని గురుద్వారా సాహిబ్‌కు మొదటి విడతలో వెళ్తున్న 500 మంది భక్తుల ప్రయాణాన్ని ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
కర్తార్‌పుర్ నడవాను ప్రారంభించిన ప్రధాని మోదీ - ఇమ్రాన్‌ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపిన మోదీ
కర్తార్‌పుర్ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నడవాను దేశానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కర్తార్‌పుర్ కారిడార్ విషయంలో భారతీయుల మనోభావాలను గౌరవించినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
"ఈ రోజు కర్తార్‌పుర్ కారిడార్‌ను దేశానికి అంకితమిస్తున్నాను. గురునానక్ దేవ్ 550 జయంతి ఉత్సవాలకు ముందు సమీకృత చెక్‌పోస్టు, కర్తార్‌పుర్ కారిడార్ ప్రారంభం కావడం.... మనకు రెండింతల ఆనందాన్ని తీసుకువచ్చింది. ఈ కారిడార్ వల్ల గురుద్వారా దర్బార్ సాహిబ్ దర్శనం సులువుగా మారుతుంది. పంజాబ్ ప్రభుత్వానికి, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి, ఈ కారిడార్‌ను సరైన సమయానికి పూర్తి చేయడానికి కష్టపడ్డ శ్రామికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా ధన్యవాదాలు తెలుతున్నాను. కర్తార్‌పుర్ కారిడార్ విషయంలో ఆయన భారతీయుల మనోభావాలను గౌరవించారు. ఇందుకు అనుగుణంగా పనిచేశారు."- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'దేశభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది'