తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు వారణాసిలో మోదీ పర్యటన.. పలు ప్రాజెక్టుల ప్రారంభం - pm modi visit to varanasi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఐఆర్​సీటీసీకి చెందిన మహాకాల్ ఎక్స్​ప్రెస్ సహా 30కి పైగా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వారణాసిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

modi
వారణాసిలో మోదీ పర్యటన.. పలు ప్రాజెక్టుల ప్రారంభం

By

Published : Feb 15, 2020, 6:48 AM IST

Updated : Mar 1, 2020, 9:31 AM IST

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. వారణాసిలో 430 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఐఆర్​సీటీసీకి చెందిన మహాకాల్ ఎక్స్‌ప్రెస్‌సహా 30కి పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతరం ప్రధాని ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారని.. చౌకఘాట్-లెహర్​తార వంతెన, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వేదిక్ సైన్స్ కేంద్రాలను ప్రారంభిస్తారని సమాచారం.

వారణాసిలోని శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులం శతాబ్ది వేడుకల ముగింపు వేడుకల్లోనూ మోదీ పాల్గొనన్నారు. ఈ సందర్భంగా 19 భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్ధాంత శిఖామణి గ్రంథాన్ని.. దీనికి సంబంధించిన మొబైల్ యాప్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన పండిట్ దీన్‌దయాళ్ 63 అడుగుల పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 200మంది కళాకారులు ఏడాదిపాటు రాత్రింబగళ్లు శ్రమించారు.

ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చే హస్త కళా ఉత్పత్తులను ప్రదర్శించే 'కాశీ ఏక్ రూప్ అనెక్' కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దేశ, విదేశీ కళాకారులు, ఔత్సాహికులతో సంభాషిస్తారు.

ఇదీ చూడండి:దేశవ్యాప్త విస్తరణ దిశగా 'ఆప్'-త్వరలో ప్రచార కార్యక్రమం

Last Updated : Mar 1, 2020, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details