ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌కు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తల్లి హీరాబెన్ మోదీని కలిసిఆయన ఆశీర్వాదం తీసుకోనున్నారు. తాను గెలిచిన నియోజకవర్గమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి సోమవారం ఉదయం వెళ్లనున్నారు మోదీ. ఈ విషయాన్ని మోదీ ట్వీట్ చేశారు.
"ఆదివారం సాయంత్రం గుజరాత్ వెళుతున్నాను. తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకుంటాను. సోమవారం ఉదయం కాశీకి వెళ్లి నన్ను విశ్వసించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతాను."