భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లొతాయ్ షేరింగ్‌తో సమావేశమయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పలు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సమాలోచనలు చేశారు.
మోదీ ఇప్పటివరకు రెండుసార్లు భూటాన్‌లో పర్యటించారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి భూటాన్‌ను సందర్శిస్తున్నారు.
రూపే కార్డు సేవలు ప్రారంభం
సెంటోకా డ్జోంగ్లో ఒక వస్తువును కొనుగోలు చేసి భూటాన్‌లో రూపే కార్డు సేవలను ప్రారంభించారు మోదీ. జలవిద్యుత్ రంగంలో భారత్-భూటాన్ మధ్య సహకారానికి ఐదు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా స్టాంపుల్ని విడుదల చేశారు.