ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆ దేశ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా యూఏఈ నుంచి బహ్రెయిన్ రాజధాని మనామా చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం గమనార్హం.