తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జన్​ధన్ యోజన'కు ఆరేళ్లు- మోదీ ప్రశంసలు - నరేంద్ర మోదీ న్యూస్​

ప్రధానమంత్రి జన్​ధన్​ యోజన ద్వారా కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. పథకం ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్​ చేశారు.

PM Modi hails achievements of 'Pradhan Mantri Jan Dhan Yojana' as it completes 6 years
'జన్​ధన్ యోజనా'కు ఆరేళ్లు.. ప్రధాని ప్రశంసలు

By

Published : Aug 28, 2020, 12:16 PM IST

Updated : Aug 28, 2020, 12:29 PM IST

ప్రధానమంత్రి జనధన్​ యోజన ప్రారంభమై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పథకంపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది పేదలకు లబ్ధి చేకూరిందని ట్వీట్​ చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్​ను కూడా పోస్టు చేశారు.

"బ్యాంకింగ్​ సేవలు అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం పీఎం-జన్​ధన్​యోజనను ప్రారంభించాం. దీని ద్వారా సమూల మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఈ పథకం పునాదిలా మారింది. కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరింది. ఎన్నో కుటుంబాల భవిష్యత్తుకు భరోసా లభించింది. దీని ద్వారా ప్రయోజనం పొందినవారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలు ఉన్నారు. ఈ పథకం విజయం కోసం నిర్విరామంగా శ్రమించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు."

-ప్రధాని మోదీ ట్వీట్​.

దేశంలోని ప్రతిఒక్కరికి బ్యాంకింగ్​​ సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో 2014 ఆగస్టు 15న పీఎం-జన్​ధన్​ యోజనను ప్రారంభించారు మోదీ. 2015 ఆగస్టు నాటికి ఈ బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90కోట్లుగా ఉండగా.. 2020 ఆగస్టు నాటికి ఆ సంఖ్య 40.35 కోట్లను దాటింది.

ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు జీరో బ్యాలెన్స్ అకౌంట్​ తెరవచ్చు. ఎలాంటి రుసుములు ఉండవు. ఉచితంగా డెబిట్​ కార్డు పొందవచ్చు. ఖాతాదారులకు రూ.2లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.

ఇదీ చూడండి: 'ఈటీవీ'కి ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు

Last Updated : Aug 28, 2020, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details