దేశంలోని బాలికల సాధికారత కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారికి విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో ఉత్తమమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అనేక రంగాల్లో బాలికలు సాధించిన విజయాలకు ట్విట్టర్ వేదికగా మోదీ అభినందనలు తెలిపారు.
" జాతీయ బాలికల దినోత్సవాన ఈ దేశపుత్రికలు సాధించిన అనేక విజయాలకు మనం నమస్కరిద్దాం. బాలికల సాధికారత కోసం కృషి చేస్తున్న వారిని అభినందించడానికి ఇదే ప్రత్యేకమైన రోజు."