తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ జెండా తిరిగొస్తేనే జాతీయ పతాకానికి జై'

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. దేశ సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఓట్లు అడిగేందుకు ఎలాంటి కారణాలు లేకే.. బిహార్​లో ఆర్టికల్​ 370 గురించి ప్రధాని మాట్లాడారని ఎద్దేవా చేశారు.

Mehbooba Mufti
జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

By

Published : Oct 23, 2020, 5:31 PM IST

దేశ సమస్యలను పరిష్కరించటంలో ఎన్​డీఏ సర్కారు విఫలమైందని విమర్శించారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆర్టికల్​ 370 గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు.

" వారి దగ్గర ఓట్లు అడిగేందుకు ఎలాంటి కారణాలు లేవు. ఆర్టికల్​ 370 రద్దు చేశాం.. జమ్ముకశ్మీర్​లో భూమి కొనండి అని చెబుతున్నారు. వ్యాక్సిన్​ ఉచితంగా ఇస్తామన్నారు. ఈరోజు ఓట్ల కోసమే ఆర్టికల్​ 370 గురించి మోదీ మాట్లాడారు. దేశ సమస్యలను పరిష్కరించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. వెయ్యి చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందనేది నిజం. ఆర్టికల్​ 370 గురించి చైనా కూడా మాట్లాడుతోంది. వివాదాస్పదంగా మారిందిని, జమ్ముకశ్మీర్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు మార్చారని అడిగారు. ప్రత్యేక హోదా తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్ముకశ్మీర్​ అంతర్జాతీయ అంశంగా మారింది. "

- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.

జమ్ముకశ్మీర్​ జెండా తిరిగి తమ చేతికి వచ్చినప్పుడే.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు ముఫ్తీ. తమ సొంత జెండా తిరిగి పొందే వరకు.. ఏ ఇతర పతాకాలను ఎత్తబోమని స్పష్టం చేశారు. కశ్మీర్​ జెండాతోనే.. మువ్వన్నెల జెండాతో సంబంధాలు బలపడతాయని తెలిపారు.

ఇదీ చూడండి:'9న లాలూ రిలీజ్​- 10న నితీశ్​కు ఫేర్​వెల్​'

ABOUT THE AUTHOR

...view details