దేశ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. గణేశుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రజలపై ఉంటాయని ట్వీట్ చేశారు. ఆనందోత్సాహాలతో సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సమాజంలోని అన్నివర్గాలను కలుపుతుందని ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు భగవంతుడి సహకారం ఉంటుందని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వాదాలు ఉంటాయన్నారు.