దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, సామరస్యాన్ని ఈద్ మరింత పెంచుతుందని ఆశిస్తునట్లు ట్వీట్ చేశారు.
" ఈద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. సోదరభావం, సామరస్యతను పెంపొందించేందుకు ఈ వేడుక మరింత దోహదపడుతుంది. అందరూ ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలి "
-ప్రధాని మోదీ ట్వీట్
లాక్‌డౌన్ నిబంధనల మేరకు ఈసారి ఇళ్ల వద్దే ప్రార్థనలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. కరోనా ప్రభావంతో తొలిసారి మసీదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్, కేరళలో నిన్నే ఈద్ వేడుకలు నిర్వహించారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతోంది.
తమిళనాడు రామేశ్వరంలో మూసిఉన్న మసీదు
లాక్డౌన్లో భాగంగా త్రిపుర అగర్తలాలో మసీదు మూసివేత
దిల్లీలో మసీదుల మూసివేత..
సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా దిల్లీలోని ప్రసిద్ధ జామా మసీదు, ఫాతేపురి మసీదులను మూసివేశారు. ప్రతి ఏటా భక్తులతో కిటకిటలాడే ఈ మసీదులు కరోనా కారణంగా ఈసారి వెలవెలబోయాయి.
ఇళ్లలోనే...
ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూ ఈసారి ఇళ్లలోనే ఈద్ వేడుకలు జరుపుకుంటున్నామని రాంచీ వాసులు తెలిపారు. భౌతిక దూరం, లాక్‌డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, బంగాల్, రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలుచోట్ల ముస్లింలు ఇళ్లలోనే ఈద్ వేడుకలు జరుపుకుంటున్నారు.
కర్ణాటక హుబ్బళ్లిలో ఇంట్లోనే ముస్లింల నమాజ్
రామేశ్వరంలో ఇంట్లోనే నమాజ్ చేస్తోన్న ప్రజలు
కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నమాజ్
కర్ణాటక హుబ్బళ్లిలో ఇంట్లోనే ముస్లింల నమాజ్