కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో మంచి జీవితం గడపాలని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
"సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు సుదీర్ఘమైన, ఆరోగ్యమైన జీవితాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతున్నాను."
- నరేంద్ర మోదీ, ప్రధాని
నితిన్ గడ్కరీ కూడా..
సోనియా జన్మదినం సందర్భంగా.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభాకాంక్షలు చెప్పారు. ఆమె సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.
వేడుకలకు దూరంగా..
కొవిడ్-19 పరిస్థితులు, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిస్తూ.. ఈ సారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు సోనియా. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సహా.. ఎక్కడా కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, పీసీసీలకు సూచించారు.
74 ఏళ్ల సోనియా.. 19 ఏళ్లపాటు కాంగ్రెస్కు నాయకత్వం వహించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తన కుమారుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా తప్పుకున్నారు. ఈ తరుణంలో మరోమారు పార్టీ అధ్యక్షురాలిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు సోనియా.
ఇదీ చదవండి:సాగు చట్టాలపై రైతు సంఘాలకు కేంద్రం లేఖ