సరిహద్దు భద్రతా దళం-బీఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సాన్ని పురస్కరించుకొని దిల్లీలోని ఛావ్లా క్యాంప్‌లో ఘనంగా 56వ రైసింగ్ డే పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్లు చేసిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దులో భద్రత కోసం బీఎస్ఎఫ్ను 1965, డిసెంబర్ 1న ఏర్పాటు చేశారు. అనంతరం దానిని బంగ్లాదేశ్ సరిహద్దుకు విస్తరించారు. భారత పారామిలిటరీ దళాల్లో ఒకటిగా ప్రధాన పాత్ర పోషిస్తోంది బీఎస్ఎఫ్. కొంత కాలంగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన సహా.. దేశంలోని అంతర్గత సమస్యల పరిష్కారానికి కూడా ఈ బలగాలను మోహరిస్తున్నారు.
హాజరైన ఉన్నతాధికారులు, అతిథులు జవాన్లకు మోదీ శుభాకాంక్షలు..
బీఎస్ఎఫ్ రైసింగ్ డే సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీఎస్ఎఫ్ దేశానికే గర్వకారణమని కొనియాడుతూ ట్వీట్ చేశారు.
" రైసింగ్ డే సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్లు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు. బీఎస్ఎఫ్ ఒక పరాక్రమ శక్తిగా తనను తాను మలుచుకుంది. దేశాన్ని రక్షించటంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌరులకు సాయం చేయటంలో కీలక భూమిక పోషిస్తోంది. భారత్‌కు గర్వకారణం"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
షా గైర్హాజరు..
బీఎస్ఎఫ్ 56వ రైసింగ్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకావాల్సి ఉంది. అయితే.. ముఖ్యమైన అధికారిక పనులు ఉన్నందున రైసింగ్ డే కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపింది హోంమంత్రి కార్యాలయం. అయితే.. ఈ కార్యక్రమానికి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:బీఎస్ఎఫ్ జవాన్ల దీపావళి వేడుకలు