తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అధ్యక్షుడిగా ట్రంప్ మరోమారు గెలవాలి: మోదీ - అమెరికా అధ్యక్షుడు

హ్యూస్టన్ వేదికగా జరిగిన 'హౌడీ-మోదీ' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలవాలని ఆకాంక్షించారు.

మోదీ, ట్రంప్​

By

Published : Sep 23, 2019, 9:06 AM IST

Updated : Oct 1, 2019, 4:07 PM IST

హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు గెలవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. హ్యూస్టన్ వేదికగా.. 50వేల మంది ప్రవాసుల మధ్య జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్​పై ప్రశంసలు కురిపించారు మోదీ.

ఈ కార్యక్రమంలో ఇద్దరు దేశాధినేతలు చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. ప్రవాసుల్లో చాలా మంది 'హౌడీ మోదీ' అనే నినాదం కలిగిన తెల్ల రంగు చొక్కాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

"భారత్​లో ఉంటున్న మేము అధ్యక్షుడు ట్రంప్​తో భాగా మమేకమయ్యాం. అభ్యర్థి ట్రంప్​ గురించి చెప్పాలంటే.. 'అబ్​కీ బార్​ ట్రంప్​ సర్కార్(ఈ సారి ట్రంప్​ గెలుస్తారు)'. అది స్పష్టంగా తెలుస్తోంది " - నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

'అబ్​కీ బార్​ ట్రంప్ సర్కార్​' అనేది 2016లో.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్​కు మద్దతుగా చేసిన నినాదం. మళ్లీ ఇప్పుడు 2020లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈవిధంగా స్పందించారు మోదీ.

ఇదీ చూడండి: 'ఉభయతారకంగా భారత్​- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం'

Last Updated : Oct 1, 2019, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details