జమ్ముకశ్మీర్ పుంఛ్ సెక్టార్‌లో ఇద్దరు ఆర్మీ కూలీలను పాక్ సైన్యం పొట్టనబెట్టుకున్న ఘటనపై.. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మౌనంగా ఎందుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
'పాక్ దుశ్చర్యలపై మౌనమెందుకు మోదీజీ..?' - latest congress news
జమ్ముకశ్మీర్ పుంఛ్ సెక్టార్‌లో పాక్ సైన్యం ఇద్దరు ఆర్మీ కూలీలను చంపిన ఘటనపై మోదీ, షా ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పాక్‌కు ఎప్పుడు జవాబు చెబుతారని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.
!['పాక్ దుశ్చర్యలపై మౌనమెందుకు మోదీజీ..?' PM Modi, Defence minister silent on Pak's barbarism: Cong](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5674199-1009-5674199-1578736571181.jpg)
'పాక్‌కు ఎప్పుడు సమాధానం చెబుతారు?'
పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైన్యానికి చెందిన కూలీలు మరణించారు. వీరిలో ఒకరి తలను శరీరం నుంచి వేరు చేసినట్లు తెలుస్తోంది. పాక్ దుశ్చర్యలపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. పాక్ దుశ్చర్యలకు దీటైన సమాధానం ఎప్పుడు చెబుతారని ఆయన ధ్వజమెత్తారు.