సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 కోట్ల మంది ఫాలోవర్ల మార్కును చేరుకున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఒబామాల కంటే మోదీ ఓ మెట్టు పైనే ఉండటం విశేషం.
ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రంప్‌ను 14.9 మిలియన్ల మంది, బరాక్ ఒబామాను 24.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 30 మిలియన్ల మంది ఫాలోవర్లతో మోదీ ఉన్నారు.
భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తన ట్విట్టర్ ఖాతాలో మోదీ హవా గురించి ప్రకటించారు. యువతలో మోదీ పట్ల ఉన్న ఆదరణను ఇది తెలుపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్లోనూ మోదీ హవా
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ప్రధాని మోదీని 50.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ట్రంప్‌నకు 65.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే 109 మిలియన్ల ఫాలోవర్లతో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.