భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఆయన వెంట త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైనికాధిపతి నరవణే ఉన్నారు. సైనిక దళాలతో భేటీ అయిన మోదీ వారిలో ధైర్యాన్ని నింపారు.
చైనాతో సరిహద్దు వివాదం, మిలిటరీ చర్చల్లో పురోగతి నేపథ్యంలో... ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లద్దాఖ్‌లోని నిము ప్రాంతంలో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో భేటీ అయిన మోదీ... సరిహద్దు భద్రతా పరిస్థితులను సమీక్షించారు.
జవాన్లకు పరామర్శ
ఇటీవల గల్వాన్ ఘర్షణలో గాయపడి మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని మోదీ పరామర్శించనున్నారు. వీర సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడమే లక్ష్యంగా మోదీ లద్దాఖ్ పర్యటన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రధాని లద్దాఖ్ పర్యటన ద్వారా సైన్యానికి... దేశం మొత్తం మద్దతుగా ఉందనే సంకేతాన్ని ఇచ్చారని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు.
లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన లద్దాఖ్‌లో సైనిక సన్నద్ధతపై మోదీ సమీక్ష లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన - సైనిక సన్నద్ధతపై సమీక్ష రాజ్‌నాథ్ పర్యటన వాయిదా
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన వాయిదా పడటం.. త్రిదళాధిపతి రావత్ లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి లద్దాఖ్‌లో సైనిక సన్నద్ధతను ఈ రోజు రక్షణమంత్రి సమీక్షించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన వాయిదా పడింది.
జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకుంది చైనా. వారి సైన్యంలోనూ భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటి నుంటి సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదీ చూడండి:గుడ్‌న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!