రష్యా వ్లాదివోస్తోక్లో తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్-రష్యా మధ్య చాలా ఏళ్లుగా స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు. భారత్ మొదటి దౌత్యకార్యాలయాన్ని రష్యాలోనే ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు ప్రధాని. సోవియట్ యూనియన్ కాలంలో ఇతర దేశాలపై ఆంక్షలు ఉన్నా భారతీయులపై లేవన్నారు.
'ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేలా నవ్యావిష్కరణలు' - russia
భారత్-రష్యా మధ్య సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్లాదివోస్తోక్లో తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ఆయన ప్రసంగించారు. 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్ అవతరించడమే తమ స్వప్నమని చెప్పారు మోదీ.
'ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేలా నవ్యావిష్కరణలు'
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు మోదీ. ఆర్థికవ్యవస్థ కొత్త పుంతలు తొక్కేందుకు నవ్యావిష్కరణలు వస్తున్నాయన్నారు.
సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంలో ముందుకెళ్తున్నట్టు వ్యాఖ్యానించారు మోదీ. రష్యాతో విద్య, వైద్యం, విద్యుత్, రక్షణ సహా కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.
Last Updated : Sep 29, 2019, 12:58 PM IST