- సైనిక దళాల మెరుగైన సమన్వయం కోసమే సీడీఎస్ ఏర్పాటు: ప్రధాని
- వన్ ర్యాంక్... వన్ పెన్షన్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలుచేస్తున్నాం: ప్రధాని
- గల్వాన్ లోయలో వీరసైనికుల పరాక్రమం చూసి గర్వంగా ఉంది: ప్రధాని
- సైనికులతో పాటు ఐటీబీపీ దళాలు చేస్తున్న సేవలు ప్రశంసనీయం: ప్రధాని
- కలసికట్టుగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం: ప్రధాని
మీ పరాక్రమ జ్వాల ఏంటో చూపించారు: మోదీ - india china war latest news
14:32 July 03
14:25 July 03
- సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మూడు రెట్లు పెంచాం : ప్రధాని
14:22 July 03
- భారత్ ఆధునిక అస్త్రశస్త్రాలను నిర్మిస్తుంది: ప్రధాని
- ప్రపంచంలోనే అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సామర్థ్యం భారత్ అందిపుచ్చుకుంది: ప్రధాని
- అనేక సంక్లిష్ట, సంక్షోభ సమయాల్లో ప్రపంచం వెంట భారత్ నడిచింది: ప్రధాని
- ప్రపంచంలో ఎక్కడ శాంతిభద్రతలు లోపించినా అక్కడ భారత్ సేవలు అందిస్తున్నాయి: ప్రధాని
- పిల్లనగ్రోవి ఊదే కృష్ణుడిని మనం పూజిస్తాం: ప్రధాని
- సుదర్శన చక్రం ధరించిన అదే కృష్ఠుడిని కూడా మనం పూజిస్తాం: ప్రధాని
- అభివృద్ధి వాదం ఇప్పుడు ప్రపంచం అనుసరిస్తున్న తత్వం: ప్రధాని
- విస్తరణ వాద యుగం ముగిసింది... వికాస వాద యుగం నడుస్తోంది: ప్రధాని
- మనకు ఇద్దరు తల్లులు: ప్రధాని మోదీ
- ఒకరు భారతమాత... మరొకరు మిమ్మల్ని కన్న వీరమాత: ప్రధాని
- మాలిక సదుపాయాల వ్యయాన్ని 3 రెట్లు పెంచాం: ప్రధాని
- వీర సైనికులను కన్నా వీరమాతలు గొప్ప త్యాగధనులు: ప్రధాని
14:20 July 03
- ఈ భూమి వీరభూమి... వీరులను కన్న భూమి: ప్రధాని
- మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తైనది: ప్రధాని
- వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను మనం తిప్పికొట్టాం: ప్రధాని
- ఇవాళ భారత్ శక్తి సామర్థ్యాలు అజేయం: ప్రధాని
- జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతం: ప్రధాని
- వీరత్వం ద్వారాని శాంతి లభిస్తుంది: ప్రధాని
- బలహీనులు శాంతిని సాధించ లేరు: ప్రధాని
- శాంతిని సాధించాలంటే ధైర్యసాహసాలు ఉండాలి: ప్రధాని
14:13 July 03
- భరత మాత శత్రువులు మీలోని కోపాన్ని చూశారు: ప్రధాని
- ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీక: ప్రధాని
- విచ్ఛిన్న శక్తుల కుట్రలకు లద్ధాఖ్ స్థానిక ప్రజలు తిప్పికొట్టారు: ప్రధాని
- 14 కార్ప్స్ సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారు: ప్రధాని
- మీ సాహస గాధలు దేశంలోని ప్రతి ఇంటిని చేరాయి: ప్రధాని
- భారత మాత శత్రువులకు మీ పరాక్రమ జ్వాల ఏంటో చూపించారు: ప్రధాని
14:10 July 03
- భారత సత్తాను సైనికులు ప్రపంచానికి చాటారు: ప్రధాని
- నిశ్చింతగా ఉందని దేశం మొత్తానికి విశ్వాసం ఉంది, భరోసా ఉంది: ప్రధాని
- సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చింతగా ఉంది: ప్రధాని
- ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించాం: ప్రధాని
- ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు మీతో ఉన్నాయి: ప్రధాని
- అమరులైన సైనిక వీరులకు మరోసారి నివాళులు: ప్రధాని
14:00 July 03
సైనికులను ఉద్దేశించి మోదీ ప్రసంగం..
లద్దాఖ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. నిమూ ప్రాంతంలో సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
13:16 July 03
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఆయన వెంట త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైనికాధిపతి నరవణే ఉన్నారు. సైనిక దళాలతో భేటీ అయిన మోదీ వారిలో ధైర్యాన్ని నింపారు.
చైనాతో సరిహద్దు వివాదం, మిలిటరీ చర్చల్లో పురోగతి నేపథ్యంలో... ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లద్దాఖ్‌లోని నిము ప్రాంతంలో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో భేటీ అయిన మోదీ... సరిహద్దు భద్రతా పరిస్థితులను సమీక్షించారు.
జవాన్లకు పరామర్శ
ఇటీవల గల్వాన్ ఘర్షణలో గాయపడి మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని మోదీ పరామర్శించనున్నారు. వీర సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడమే లక్ష్యంగా మోదీ లద్దాఖ్ పర్యటన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రధాని లద్దాఖ్ పర్యటన ద్వారా సైన్యానికి... దేశం మొత్తం మద్దతుగా ఉందనే సంకేతాన్ని ఇచ్చారని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు.
లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన
లద్దాఖ్‌లో సైనిక సన్నద్ధతపై మోదీ సమీక్ష
లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన - సైనిక సన్నద్ధతపై సమీక్ష
రాజ్‌నాథ్ పర్యటన వాయిదా
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన వాయిదా పడటం.. త్రిదళాధిపతి రావత్ లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి లద్దాఖ్‌లో సైనిక సన్నద్ధతను ఈ రోజు రక్షణమంత్రి సమీక్షించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన వాయిదా పడింది.
జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకుంది చైనా. వారి సైన్యంలోనూ భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటి నుంటి సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
11:25 July 03
పరామర్శించనున్న ప్రధాని...
ఇటీవల గల్వాన్ లోయ ఘటనలో గాయపడి మిలటరీ అస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించనున్నారు.
11:06 July 03
కీలక భేటీ..
లద్దాఖ్‌లోని నిము ప్రాంతానికి మోదీ చేరుకున్నారు. సైన్యం, వాయుసేన, ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఇండస్ నదీ తీరంలో 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న అత్యంత కఠినమైన మైదాన ప్రాంతం ఇది.
10:51 July 03
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. భద్రతా దళాల్లో ధైర్యం నింపడమే లక్ష్యంగా మోదీ.. పర్యటన కొనసాగుతోంది. త్రిళాధిపతి బిపిన్ రావత్, సైనికాధిపతి నరవాణే... ప్రధాని మోదీ వెంట ఉన్నారు.
చైనాతో సరిహద్దు వివాదం, సైన్యం చర్చల్లో పురోగతి నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
- లద్ధాఖ్‌లోని నిము ప్రాంతంలో సీనియర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ప్రధాని.
- చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
- సరిహద్దుల్లో తాజా పరిస్థితులను ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులు.. మోదీకి వివరించారు.
చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని లద్ధాఖ్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని పర్యటన ద్వారా సైన్యానికి దేశం మొత్తం మద్దతుగా ఉందనే సంకేతాన్ని మోదీ ఇచ్చారని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు.
10:12 July 03
ఆకస్మిక పర్యటన...
భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లోని లేహ్‌కు వెళ్లారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి ముకుంద్ నరవాణే.. ప్రధానితో పాటు ఉన్నారు. తూర్పు లద్ధాఖ్‌లో ప్రస్తుత పరిస్థితులను ప్రధాని మోదీకి 14 కార్ప్స్ అధికారులతో కలిసి రావత్ వివరిస్తున్నారని సమాచారం.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన వాయిదా పడటం.. త్రిదళాధిపతి రావత్ లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి లద్దాఖ్‌లో సైనిక సన్నద్ధతను ఈ రోజు రక్షణమంత్రి సమీక్షించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన వాయిదా పడింది.
జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకుంది చైనా. వారి సైన్యంలోనూ భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటి నుంటి సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
10:06 July 03
ఉద్రిక్తతల నడుమ లద్ధాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన
సరిహద్దు ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన వెంటే ఉన్నారు. చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని ఆకస్మిక పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. లేహ్‌లో సైన్యం సన్నద్ధతను మోదీ సమీక్షించనున్నారని సమాచారం.