భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్‌లోని బిష్కెక్కు చేరుకున్నారు. ఇవాళ, రేపు జరిగే షాంఘై సహకార సదస్సులో పాల్గొంటారు మోదీ. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నారు ప్రధాని.
బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - కిర్గిస్థాన్
షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా చైనా, రష్యా అధ్యక్షులతో సమావేశం కానున్నారు మోదీ.
బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఈ పర్యటన ఎస్సీఓ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ భద్రత స్థితిగతులు, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశాల్లో వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు.
ప్రధాని పాక్ గగనతలం మీదుగా కాకుండా ఒమన్, ఇరాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్ చేరుకున్నారు.