కరోనా మహమ్మారిపై పోరులో ముందువరుసలో నిలిచి సంకల్ప బలంతో పోరాడుతున్న వైద్యుల సేవలు నిరుపమానమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
"మన వైద్యులకు భారత్ సెల్యూట్ చేస్తోంది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారంటూ ఇటీవల ఓ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జులై 1న డాక్టర్ బీసీ రాయ్ జయంతిని పురస్కరించుకొని వైద్యుల దినోత్సవం పాటిస్తారు.
వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు..