తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాకు తక్షణ సాయంగా రూ. 500 కోట్లు - ఒడిశాకు 500 కోట్ల సాయం మోదీ

అంపన్​ తుపానుతో అతలాకుతలమైన ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితులను పరిశీలించారు. తక్షణ సాయం కింద రూ. 500 కోట్లు ప్రకటించారు. తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలను ప్రశంసించారు మోదీ.

odisha
తక్షణ సాయంగా ఒడిశాకు రూ. 500 కోట్లు

By

Published : May 22, 2020, 7:41 PM IST

ఒడిశాలోని అంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితులను అంచనా వేశారు.

ఒడిశా గవర్నర్ గణేశీ లాల్​, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​తో సమావేశం నిర్వహించి విపత్తు వల్ల జరిగిన నష్ట వివరాలు తెలుసుకున్నారు మోదీ. అనంతరం తక్షణ సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందిన తర్వాత దీర్ఘకాల సహాయక చర్యల కోసం మరింత సాయం అందించనున్నట్లు మోదీ తెలిపారు.

మీ చర్యలు భేష్

ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా ఒడిశా ప్రభుత్వం నష్టాన్ని చాలా వరకు నివారించగలిగిందని మోదీ కితాబిచ్చారు. విద్యుత్, మౌలిక సదుపాయాలు, వ్యవసాయంపై తుపాను తీవ్ర ప్రభావం చూపిందని వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించకుండా జాగ్రత్త పడినందుకు ఒడిశా యంత్రాంగాన్ని ప్రశంసించారు. ఓ వైపు కరోనాతో పోరాడుతున్న సమయంలో రాష్ట్రం మరో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగి సైతం మోదీతో కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మోదీ మాట వెయ్యి కోట్లు- దీదీ పాట లక్ష కోట్లు

ABOUT THE AUTHOR

...view details