'పరీక్ష పే చర్చ 2020'లో పాల్గొనే విద్యార్థుల ఎంపిక కోసం ఓ పోటీని ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకు సంబంధించిన వెబ్సైట్ లింక్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు.
"పరీక్షలు దగ్గర పడ్డాయి. అలానే పరీక్షలపై చర్చకూ సమయం ఆసన్నమైంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించేందుకు మనమందరం కలసి కృషి చేద్దాం."
- నరేంద్ర మోదీ, ప్రధాని
ఈ పోటీలో అర్హత సాధించిన విద్యార్థులు వచ్చే ఏడాది దిల్లీలో మోదీతో జరిగే ముఖాముఖిలో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు. 9-12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీకి అర్హులు.
పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడి, భయం, ఆందోళనలను జయించేందుకు విద్యార్థులు ఏం చేయాలో చెప్పేందుకు గత రెండేళ్లుగా 'పరీక్ష పే చర్చ' కార్యక్రమం నిర్వహిస్తున్నారు మోదీ.
ఇదీ చూడండి: శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు