ప్రచండ తుపాను 'అంపన్' బీభత్సానికి చిగురుటాకులా వణికిన బంగాల్లో పరిస్థితుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు ప్రకటించారు.
బంగాల్ పునర్నిర్మాణంలో మమతతో కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. నష్టపోయిన ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసానిచ్చారు. తూపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.