తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్మలతో మోదీ భేటీ- రెండో ఆర్థిక ప్యాకేజీపై చర్చ! - pm meets fm

కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న వ్యాపార రంగాలు, ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు రెండో ఆర్థిక ప్యాకేజీపై కేంద్రమంత్రులతో కీలక చర్చలు జరిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్థిక మంత్రి, హోంమంత్రి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

PM meets FM
కేంద్రమంత్రులో మోదీ భేటీ

By

Published : May 2, 2020, 4:01 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్​ సహా ఆ శాఖ అధికారులతో వరుస భేటీలు నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కరోనా వైరస్​ కట్టడికి విధించిన లాక్​డౌన్​ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పలు రంగాలను ఆదుకునేందుకు రెండో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంపై కీలక చర్చలు జరిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, సంక్షోభంలో ఉన్న వ్యాపార రంగాలను ఆదుకునేందుకు అవసరమమైన ప్రణాళిక, ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను మోదీకి ప్రెసెంటేషన్​ రూపంలో నివేదించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

పౌర విమానయాన, కార్మిక శాఖ సహా ఇతర శాఖల మంత్రులతో శుక్రవారం సమావేశాలు నిర్వహించారు మోదీ. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సహా దేశంలో చిరు వ్యాపారాల పునరుద్ధరణపై వాణిజ్య, ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖల అధికారులతో చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో అమిత్ షా, నిర్మలా సీతారామన్​ కూడా పాల్గొన్నారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో మార్చి నెలఖర్లో రూ.1.7 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంటగ్యాస్, మహిళలకు, వృద్దులకు ఆర్థిక సాయం అందిస్తునట్లు పేర్కొంది. ఇప్పుడు అతిత్వరలో రెండో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

ABOUT THE AUTHOR

...view details