తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తదుపరి లక్ష్యం... ఒకే దేశం- ఒకే ఎన్నిక' - ప్రధాని

ఒకే దేశం- ఒకే ఎన్నికపై విస్తృత చర్చలు జరగాలని ప్రధాని ఉద్ఘాటించారు. ఒకే దేశం- ఒకే రాజ్యాంగం, ఒకే దేశం- ఒకే పన్ను వంటి అంశాలను ప్రస్తావిస్తూ... దేశాభివృద్ధికి జమిలీ ఎన్నికలు తప్పనిసరి అన్నారు.

'ఒకే దేశం- ఒకే ఎన్నికపై చర్చలు జరగాలి'

By

Published : Aug 15, 2019, 10:29 AM IST

Updated : Sep 27, 2019, 2:03 AM IST

ఆర్టికల్​ 370 రద్దుతో ఒకే దేశం- ఒకే రాజ్యాంగం కల సాకారమైందని హర్షం వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్ర మోదీ. జీఎస్టీతో ఒకే దేశం- ఒకే పన్ను..., విద్యుత్​ రంగంలో ఒకే దేశం- ఒకే గ్రిడ్​..., రవాణా రంగంలో కామన్ మొబిలిటీ కార్డ్​తో ఒకే దేశం- ఒకే కార్డ్​ ఆకాంక్ష నెరవేరిందని గుర్తుచేశారు.

ఒకే దేశం- ఒకే ఎన్నిక కలను సాకారం చేసుకోవడమే తదుపరి లక్ష్యమని స్పష్టంచేశారు మోదీ. ఇందుకోసం విస్తృత చర్చలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశం మరింత అభివృద్ధి చెందేందుకు జమిలీ ఎన్నికలు తప్పనిసరి అన్నారు మోదీ.

'ఒకే దేశం- ఒకే ఎన్నికపై చర్చలు జరగాలి'

ఇదీ చూడండి- 'జల్​ జీవన్​'తో ఇంటింటికీ తాగునీరు: మోదీ

Last Updated : Sep 27, 2019, 2:03 AM IST

ABOUT THE AUTHOR

...view details