మార్చి 10లోగా పీఎం కిసాన్ పథకానికి అర్హత పొందిన 4.74 కోట్ల మంది రైతులకు రెండో విడత నగదు బదిలీకీ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. వీరందరి ఖాతాల్లో వచ్చే నెలలో రూ.2వేలు జమచేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
'ప్రధాని కిసాన్ సమ్మాన్' రెండో విడత నగదు బదిలీ - ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ నిధి
ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి అర్హులైన 4.74 కోట్ల మంది రైతులకు.. రెండో విడత నగదు బదిలీలో భాగంగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమజేస్తామని అధికారులు తెలిపారు.
!['ప్రధాని కిసాన్ సమ్మాన్' రెండో విడత నగదు బదిలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2771719-359-8c8508f3-948e-44c2-8906-148b1fda2d70.jpg)
'ప్రధాని కిసాన్ సమ్మాన్' రెండో విడత నగదు బదిలీ
'ప్రధాని కిసాన్ సమ్మాన్' రెండో విడత నగదు బదిలీ
దేశంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏడాది రూ.6వేలు ఆర్థిక సాయం అందజేసేలా పీఎంకిసాన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. మూడు విడతల్లో రూ.2000వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా 12కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని తెలిపింది.