ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. లద్దాఖ్‌లోని భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని పేర్కొనటం ద్వారా సైనికులను ప్రధాని అవమానించారని ఆరోపించారు. చైనా సైనికులను భారత భూభాగం నుంచి ఎప్పుడు పంపిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిసువాలో నిర్వహించిన తొలి ర్యాలీలో ఈ మేరకు విమర్శలు చేశారు రాహుల్.
" వారు(చైనా) 1200 కిలోమీటర్ల మన భూమిని ఆక్రమించారు. కానీ.. ఎవరూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పి మన సైనికులను ప్రధాని ఎందుకు అవమానించారు? మా ప్రశ్న ఒక్కటే, మోదీ జీ.. మన భూభాగంలో ఉన్న చైనా సైనికులను ఎప్పుడు వెనక్కు పంపిస్తారు? "